డిజిటల్‌తో నిర్మాతలకు లాభాలు

25 Oct, 2017 10:22 IST|Sakshi

సాక్షి, చెన్నై : డిజిటల్‌తో నిర్మాతలు లాభాలు పొందండని నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ పేర్కొన్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం నెంజిల్‌ తుణివిరుందాల్‌. సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి మెహరీన్ నాయకిగా ముఖ్య పాత్రల్లో విక్రాంత్, హరీశ్‌ఉత్తమన్ నటించారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించారు.

త్వరలో విడుదలకు ముస్తాబవుతున్న ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథి గా పాల్గొన్న విశాల్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. విశాల్‌ మాట్లాడుతూ నిర్మాతల మండలి అధక్షుడు కచ్చితంగా సినీ కార్యక్రమాల్లో పాల్గొనాలనేమీ లేదన్నారు.

తనకు ఇలాంటి ఆడియో, టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం ఉండదని అన్నా రు. అయితే ఈ వేదికపై నాకు చాలా సన్నిహితులు ఉన్నారని, అందుకనే బయట ఎన్ని చర్చనీయాంశ సంఘటనలు జరుగుతున్నా ఈ నెంజిల్‌ తుణివిరుందాల్‌ చిత్ర టీజర్‌ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నానని అన్నారు. చిత్రాలను డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా విక్రయించి నిర్మాతలు అధిక లాభాలు పొందాలని అన్నారు.

శాటిలైట్‌ హక్కులతో ఇంకా అధిక ఆదాయాన్ని పొందలేకపోతున్నామని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థలకు చిత్రాలను విక్రయించి లాభాలను పొందండని చెప్పారు. ఆ విధంగా తుప్పరివాలన్, మగళీర్‌మట్టుం చిత్రాలు లాభపడ్డాయని తెలిపారు.డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సంస్థల గురించి నిర్మాతల మండలిలో వివరాలను తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు