నిర్మాతలు కదా బాధ పడాల్సింది.. వారికెందుకు

4 May, 2018 21:42 IST|Sakshi

హీరోయిన్‌ అదితిరావ్‌ హైదరి రెండవ చిత్రంతోనే తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ఈ వార్తలపై ఉత్తరాది భామ స్పందించింది. తాను పారితోషికం పెంచినట్లు కొందరు వదంతులు ప్రచారం చేస్తున్నారు. అయినా పారితోషికం గురించి వారికేందుకు బాధ.. ఆ విషయంలో నిర్మాతలు కదా బాధ పడాల్సిందని అదితి చురకలు వేసింది. డబ్బు మీద కంటే మంచి పాత్రలే ముఖ్యం అని ఆమె పేర్కొంది. 

ఇప్పటివరకూ హిందీ, తమిళ చిత్రాల్లోనే నటిస్తున్నాను.. ప్రస్తుతం తెలుగులోనూ నటించే అవకాశం వచ్చిందని అదితి చెప్పుకొచ్చింది. తెలుగులో సుధీప్‌కు జంటగా ‘సమ్మోహనం’ అనే చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది. మూడు భాషల్లో నటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. గ్లామరస్‌ పాత్రలు తనకు నప్పవని, హిందీలో కూడా అలాంటి పాత్రల్లో నటించలేదన్నారు. మోడ్రన్‌ దుస్తులు ధరించినా అధిక చిత్రాల్లో తన పాత్రలు హోమ్లీగానే కనిపిస్తాయని తెలిపింది. అలా నటించడమే చాలా ఇష్టమని అదితిరావ్‌ పేర్కొంది. 

దర్శకుడు మణిరత్నం మెచ్చిన నటిగా ఈ బ్యూటీ గుర్తింపు పొందిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కాట్రువెలియిడై చిత్రంతో కోలీవుడ్‌కు అదితిరావ్‌ పరిచయమైంది. ప్రస్తుతం మరోసారి తన చిత్రం సెక్క సివంద వానంలోనూ మణిరత్నం అవకాశం కల్పించారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు