ఆమె అలాంటి పాత్రలో నటిస్తుందా..!

19 Jul, 2017 18:58 IST|Sakshi
ఆమె అలాంటి పాత్రలో నటిస్తుందా..!

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కాలా.  అల్లుడ, యువ హీరో ధనుష్ తన  వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మిస్తున్న  ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ హూమాఖురేషి నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ మాట వాస్తవం అయినా, రజనీకాంత్ కు జంటగా నటిస్తున్నది మాత్రం హీరోయిన్ ఈశ్వరీ రావు అట. మరి హూమాఖురేషి పాత్ర ఏమిటనే ఆసక్తి ప్రేక్షకుల లో మొదలైంది..? ఇందులో తను ఒక వేశ్యగా నటిస్తున్నారట. అయినా ఈ అమ్మడి పాత్ర చాలా బలమైనదిగా ఉంటుందట.

ప్రస్తుతం కాలా చిత్ర షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. ఇందుకోసం ముంబాయిలోని ధారవి ప్రాంతాన్ని మరపించేలా బ్రహ్మాండమైన సెట్‌ను వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇందులో కబాలి చిత్రంలో కంటే రాజకీయం అధికంగా ఉంటుందట. కాలాలోని రాజకీయపరమైన సంభాషణలు పెద్ద చర్చకు దారి తీస్తాయంటున్నారు. అలాంటి సంభాషణలను రజనీకాంత్ కోరి మరీ రాయించుకున్నారనే ప్రచారం సోషలో మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఏదేమైనా కాలా చిత్రంపై అంచనాలు తారా స్థాయిలోనే ఉన్నాయన్నది నిజం.పలు విశేషాలతో కూడిన  ఈ చిత్ర రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. కబాలి వంటి సెన్సేషనల్‌ చిత్రం తరువాత రజనీ, దర్శకుడు పా. రంజిత్ ల కాంబినేషనల్‌లో తెరకెక్కుతున్న చిత్రం కాలా. భాషా తరువాత అంతటి పవర్ పుల్ పాత్రలో డాన్‌గా రజనీకాంత్ ను ఈ చిత్రంలో చూడబోతున్నామంటున్నాయి చిత్ర వర్గాలు.