మళ్లీ వస్తున్న ఆండ్రియా

19 Sep, 2019 08:05 IST|Sakshi

చెన్నై : నటి ఆండ్రియా ఒక సంచలనం. బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ లేడీ. అంతే కాదు మల్టీపుల్‌ టాలెంటెండ్‌ నటి. ఈమెలో మంచి గాయని. ఇక గీతరచయిత కూడా. ఆ మధ్య ఆంగ్లంలో పాట రాసి, తనే ట్యూన్‌ కట్టి ఆల్బమ్‌ విడుదల చేసింది. ఇక నటిగా ఎలాంటి పాత్రనైనా ఛాలెంజ్‌గా తీసుకుని నటించే సత్తా కలిగింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించకుండా, చాలా సెలెక్టెడ్‌ పాత్రల్లోనే నటిస్తూ తన కంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటి ఆండ్రియా. ఆ మధ్య వడచెన్నైలో ఏ హీరోయిన్‌ చేయడానికి సాహసించని వైవిధ్యభరిత పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆండ్రియా మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే ఒక వివాహితుడిని నమ్మి శారీరకంగానూ, మానసికంగానూ బాధింపునకు గురయ్యానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొని సంచలనం కలిగించింది. అదేవిధంగా మళ్లీ మామూలు మనిషిని కావడానికి వైద్యం పొందినట్లు చెప్పింది. కాగా అలాంటి సంచలన నటి ఆండ్రియా తాజాగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు యువ నటుడు సిబిరాజ్‌కు జంటగా నటిస్తోంది. ఇందులో మరో హీరోయిన్‌గా నటి అతుల్యరవి నటిస్తోంది. 2012లో మధుబాన కడై చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు కమల్‌ కన్నన్‌ ఏడేళ్ల తరువాత దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. కాగా ఈ చిత్రంతో నటి ఆండ్రియా కొత్తగా కనిపిస్తుందంటున్నారు. ఆమె పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని చెప్పారు. చూద్దాం ఈ చిత్రం ఆండ్రియా కెరీర్‌కు ఎంత వరకూ దోహదపడుతుందో. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ సంబరాలు

సూఫీ సుజాత

రైతు పాత్రలో...

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

బిగ్‌బాస్‌: గొడవలు పెట్టడం ఎలా?

పెళ్లైన విషయం మర్చిపోయిన నటి

‘అతనొక యోగి.. అతనొక యోధుడు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఆదంత్యం నవ్వించేలా ‘మేడ్‌ ఇన్‌ చైనా’ ట్రైలర్‌

బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?

కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘డ్రీమ్‌ గర్ల్‌’

శివజ్యోతిని ఎమోషనల్‌గా ఆడుకుంటున్నారా?

రావణుడిగా ప్రభాస్‌.. సీతగా దీపికా పదుకోన్‌!

ఆ బాలీవుడ్‌ దర్శకుడు ఇక లేరు

బిగ్‌బాస్‌: రీఎంట్రీ లేనట్టేనా..!

విశాఖలో నా ఫ్యాన్స్‌ ఎక్కువ

మైకం కమ్మినంత పనైంది: కాజల్‌

నా అభిమానుల జోలికి రావద్దు: స్టార్‌ హీరో

ది బిగ్‌ బుల్‌

గొప్ప  అవకాశం  లభించింది : అశ్వినీదత్‌

మనో విరాగి

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం : విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మళ్లీ వస్తున్న ఆండ్రియా

ప్రేమ సంబరాలు

‘ఇలాంటి సినిమాలకు డబ్బులుంటే సరిపోదు’

విఘ్నేష్‌కు నయనతార భారీ కానుక

ఇప్పుడు విలన్‌గా ఎందుకు అన్నారు : వరుణ్‌

ఆస్కార్‌ బరిలో మోతీ భాగ్‌