ఆ హీరోయిన్‌ మూటాముల్లె సర్దుకోవలసిందే !

22 Jun, 2017 21:50 IST|Sakshi
ఆ హీరోయిన్‌ మూటాముల్లె సర్దుకోవలసిందే !

బొద్దుగుమ్మ హన్సిక పరిస్థితి చూసి ఇటీవల సినీ వర్గాలు అయ్యో పాపం అనుకున్నాయి. కొందరైతే ఈమె పని అయిపోయింది. ఇక మూటాముల్లె సర్దుకోవలసిందే అనే కామెంట్లు కూడా చేశారు. అందుకు కారణం హన్సిక చేతిలో ఒక్క చిత్రం కూడా లేదన్నదే. అయితే ఇలాంటి పనికి మాలిన కామెంట్స్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను సైలెంట్‌గా చేసుకుపోతోంది ఈ భామ. అర్ధం కాలేదా? హన్సికకు మళ్లీ అవకాశాలు వరుస కడుతున్నాయి.

ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు, మాలీవుడ్‌లో ఒకటి చిత్రాలతో హన్సిక బిజీగా ఉంది. తమిళంలో డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాతో గుళేభకావళి చిత్రంలో రొమాన్స్‌ చేస్తున్న హన్సిక శశికుమార్‌కు జంటగా కొడివీరన్‌ చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు తొలిసారిగా మలయాళ చిత్ర సీమలోకి అడుగుపెట్టి అక్కడ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్, సుదీప్‌ హీరోలుగా నటిస్తున్న విలన్‌ చిత్రంలో హన్సిక ప్రధాన పాత్రలో మెరుస్తోంది. ఇందులో టాలీవుడ్‌ ప్రముఖ హీరో విశాల్‌ విలన్‌గా విలక్షణ పాత్రలో నటించడం మరో విశేషం. కాగా ఇటీవలే హన్సిక విలన్‌ చిత్ర షూటింగ్‌లో జాయిన్‌ అయ్యిందట.