అదో వింత అనుభవం

27 Sep, 2017 03:51 IST|Sakshi

 ఆ పాత్ర విన్నప్పుడు పెద్దదిగానే ఉంది అని చెప్పుకొచ్చింది నటి నందిత. మరి ఆ కథేంటో చూద్దామా‘ తొలి చిత్రం అట్టకత్తిలోనే పాఠశాల, కళాశాల విద్యార్థినిగా విభిన్న అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న ఈ భామ ఎదిర్‌నీశ్చల్‌ లాంటి చిత్రాల్లో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకూ హోమ్లీ పాత్రలతో అలరించిన నందిత తాజాగా తన రూట్‌ మార్చుకుందట. ఇకపై అందాల నందితను చూస్తానంటున్న ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉంది. ప్రస్తుతం సెల్వరాఘవన్‌ చిత్రం నెంజమ్‌ మరప్పదిల్లై చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తోందట. ఈ అమ్మడితో చిట్‌చాట్‌...

సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించిన అనుభవం గురించి?
జ: సెల్వరాఘవన్‌ తన చిత్రం నెంజమ్‌ మరప్పదిల్‌లైలో నటించమని అడినప్పుడు నేను నమ్మలేక పోయాను. సాధారణంగా ఆయన చిత్రాల్లో హీరోయిన్లకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.అందుకే అందరు హీరోయిన్లు ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. నెంజమ్‌రప్పుదిల్లై చిత్రం ప్రచారాల్లో, పోస్టర్లలో తాను అధికంగా కనిపించకపోవచ్చు. అయితే చిత్రం చూసిన తరువాత ప్రేక్షకులు తన పాత్ర గురించే మాట్లాడుకుంటారు.

వణంగాముడి చిత్రంలో పోలీసు అధికారిణిగా నటిస్తున్నారట?
జ: ఇప్పుటి వరకూ నందితను హోమ్లీ పాత్రల్లోనే చూశారు. వణంగాముడి చిత్రంలో వేరే నందితను చూస్తారు. ఇందులో యక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించాను. నేను కొంచెం డాన్స్‌ కూడా నేర్చుకున్నాను. దాన్ని ఈ చిత్రంలో వాడుకునే అవకాశం కలిగింది. వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించాలని చెప్పడం కాదు. దాన్ని చేతల్లో చూపాలి. నేను మాత్రం విభిన్న కథా పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. అలాంటి చిత్రాల్లో ఈ వణంగాముడి ఒకటి.

ఇతర భాషా చిత్రాలపైనా దృష్టి సారిస్తున్నట్లున్నారు?
జ: నిజం చెప్పాలంటే నేను కన్నడ చిత్రాల్లో నటించిన తరువాతే తమిళంలోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ చేతి నిండా చిత్రాలు ఉండడంతో ఇతర భాషా చిత్రాలపై దృష్టి సారించలేకపోతున్నాను.ఆ మధ్య ఎక్కిడికి పోతావే చిన్నదానా అనే తెలుగు చిత్రంలో నటించాను. ఆ చిత్రం నోట్ల రద్దు తరుణంలో విడుదలైనా మంచి వసూళ్లను రాబట్టింది. చాలా మంది ప్రముఖ నటీమణులు నటించడానికి నిరాకరించిన పాత్రను నేను అందులో నటించాను.

విజయ్‌ నటించిన పులి చిత్రంలో చాలా చిన్న పాత్రలో నటించడానికి కారణం?
జ: ఓ..ఆ విషయం మీకు ఇంకా గుర్తుందా‘ నేనెప్పుడో మరిచిపోయాను. వాస్తవమేమిటంటే ఆ పాత్ర నాకు చెప్పినప్పుడు పెద్దగానే ఉంది. ఆ తరువాత చిత్రం థియేటర్‌కు వచ్చినప్పుడు చిన్నదిగా మారిపోయింది. ఆ విషయం గురించి ఇప్పుడు చర్చించడంలో ప్రయోజనం ఏముంది? అదో అనుభవంగా భావిస్తాను. 

మరిన్ని వార్తలు