ఇంకా బాయ్‌ఫ్రెండ్‌ దొరకలేదు!

18 Aug, 2018 10:21 IST|Sakshi

తమిళసినిమా: నాకింకా బాయ్‌ఫ్రెండ్‌ దొరకలేదు అంటోంది నటి నివేదాపేతురాజ్‌. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న యువ నటీమణుల్లో నివేదా పేతురాజ్ ఒకరు.. చిత్రాల ఎంపిక విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నానంటున్న నివేదాపేతురాజ్‌ను జయం రవితో జత కట్టిన టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రం నటిగా తన స్థాయి పెంచింది. ఆ ఉత్సాహంతో ప్రస్తుతం దర్శకుడు ఎళిల్‌ దర్శకత్వంలో విష్ణువిశాల్‌ సరసన జగజాల కిల్లాడి చిత్రం, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో పార్టీ చిత్రం, విజయ్‌ఆంటోనీకి జంటగా తిమిర్‌పిడిచవన్, ప్రభుదేవాతో ఒక చిత్రం అంటూ బిజీగా నటించేస్తోంది.
వీటితో పాటు తెలుగులోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. సెలెక్టెడ్‌ అంటూ చాలా చిత్రాలే చేస్తునట్లున్నారే అన్న ప్రశ్నకు అన్నీ నచ్చిన కథాపాత్రలతో కూడిన చిత్రాలే చేస్తున్నాను అని తెలివిగా బదులిచ్చింది. సరే రెండు భాషల్లో నటిస్తున్నావు కదా  ప్రేమలో పడ్డారా, బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడా అని అడిగితే బాయ్‌ఫ్రెండే ఇంకా దొరకలేదు .అలాంటిది ప్రేమకు ఆస్కారం ఎక్కుడుంటుంది? అని కూల్‌గా బదులిచ్చింది.

అయినా బాలీవుడ్‌ హీరోయిన్లను అడిగినట్లు తనను అలాంటి ప్రశ్న వేస్తున్నారేమిటీ? అంటూ మన పరిస్థితులు వేరు కదా అని అంది. నిజం చెప్పాలంటే తనకు బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఆలోచించేంత సమయం, అలాంటి ఆలోచన లేదు అని చెప్పింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ నటిస్తుండడంతో ఆ భాషను నేర్చుకుంటున్నానని, త్వరలోనే తెలుగులో మాట్లాడతాననే విశ్వాసాన్ని వ్వక్తం చేసింది. ఇకపై తమిళం, తెలుగు రెండు భాషలకు తగిన ప్రాధాన్యతనిస్తూ నటిస్తానని నటి నివేదాపేతురాజ్‌ అంటోంది. బహుభాషా నటి ప్రయోజనాలను అవగతం చేసుకున్నట్లుంది భామ. అన్నట్లు తాను గ్లామర్‌కు దూరం అని చెప్పుకొచ్చిన నివేదాపేతురాజ్‌ మోడ్రన్‌ దుస్తుల్లో అందాలారబోస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా