స్క్రీన్‌ టెస్ట్‌

7 Nov, 2017 00:25 IST|Sakshi

► ఈ టాలీవుడ్‌ హీరో ‘ఈక్వెస్ట్రియన్‌ క్రీడ’ లో మంచి ప్రతిభావంతుడు. అతను ఈక్వెస్ట్రియన్‌ పోలో టీమ్‌ యజమాని కూడా!
ఎ) తరుణ్‌    బి) ప్రభాస్‌ సి) రామ్‌చరణ్‌    డి) రవితేజ

► కాలభైరవ అనే టాలీవుడ్‌ సింగర్‌ ఏ సంగీత దర్శకుని కుమారుడు?
ఎ) యం.యం.కీరవాణి బి) మణిశర్మ సి) మాధవపెద్ది సురేష్‌ డి) ఇళయరాజా

‘డైవోర్స్‌ ఇన్విటేషన్‌’ అనే హాలీవుడ్‌ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించినది ఈ కుటుంబ కథా చిత్రాల దర్శకుడు. ఆయనెవరు?
ఎ) ఎ. కోదండ రామిరెడ్డి   బి) యస్వీ కృష్ణారెడ్డి సి) కోడి రామకృష్ణ   డి) ఈవీవీ సత్యనారాయణ

► నాగచైతన్య తెలుగులో చేసిన ‘ఏ మాయ చేశావె’ తమిళంలో ‘విన్నైత్తాండి వరువాయా’గా తెరకెక్కింది. అందులో హీరో ఎవరు?
ఎ) మాధవన్‌    బి) శింబు సి) విజయ్‌ సేతుపతి    డి) జై

► నటి వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఆమెకు ‘వాణిశ్రీ’ అని పేరు పెట్టిన తెలుగు నటుడెవరో తెలుసా?
ఎ) ఎస్వీ రంగారావు బి) కొంగర జగ్గయ్య సి) మిక్కిలినేని   డి) కాంతారావు

► హీరో కాక ముందు ‘రేడియో జాకీ’గా ఏ తెలుగు హీరో పని చేశాడో తెలుసా?
ఎ) నాని    బి) శర్వానంద్‌ సి) నందు  డి) నవీన్‌ చంద్ర

► ‘ప్రేమనగర్‌’ సినిమాలో బాల నటునిగా కనిపించిన ఇప్పటి హీరో ఎవరో తెలుసా?
ఎ) వెంకటేశ్‌    బి) నాగార్జున సి) సుమంత్‌    డి) బాలకృష్ణ

► కన్నడ బ్యూటీ సంజన తన మొదటి తెలుగు సినిమాలో ఏ హీరోయిన్‌కి చెల్లెలిగా నటించింది?
ఎ) శ్రియ బి) తాప్సీ సి) త్రిష డి) అయేషా టకియా

► ప్రభాస్‌ నటించిన ఓ సినిమాకు పోసాని కృష్ణమురళి స్టోరీ–స్క్రీన్‌ప్లే–డైలాగ్స్‌ అందించారు. ఆ సినిమా పేరేంటి?
ఎ) రాఘవేంద్ర బి) ఈశ్వర్‌ సి) అడవిరాముడు డి) వర్షం

► రజనీకాంత్‌ నటించిన బాషా, నరసింహా, పెదరాయుడు.. ఈ మూడు సినిమాలకు ఒకే నటుడు డబ్బింగ్‌ చెప్పారు. ఆయనెవరో తెలుసా?
ఎ) రవిశంకర్‌   బి) సాయికుమార్‌ సి) శివాజీ    డి) అయ్యప్ప పి.శర్మ

► ‘అజబ్‌ ప్రేమ్‌కి గజబ్‌ కహానీ’ హిందీ సినిమా తరుణ్‌ నటించిన ఓ తెలుగు సినిమాకి రీమేక్‌? అది ఏ సినిమా?
ఎ) నువ్వేకావాలి బి) నువ్వే నువ్వే సి) సోగ్గాడు డి) నీ మనసు నాకు తెలుసు

► కాజల్‌ అగర్వాల్‌ నటించిన మొదటి సౌతిండియన్‌ సినిమాలో హీరో ఎవరో తెలుసా?
ఎ) అజిత్‌ బి) విజయ్‌ సి) ధనుష్‌ డి) అర్జున్‌ సర్జా

► ‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయం చెబుతాను..’ అనే పాటలో నటించిన నటుడెవరో గుర్తున్నాడా?
ఎ) పద్మనాభం   బి) రాజబాబు సి) రమణారెడ్డి    డి) రేలంగి

► ‘అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చే శావేమయ్యా..’ అనే పాట ‘అదృష్టవంతులు’ సినిమాలోనిది. ఆ పాట రచయిత ఎవరో తెలుసా?
ఎ) సి. నారాయణరెడ్డి బి) ఆచార్య ఆత్రేయసి) జూ. సముద్రాల డి) దాశరథి

► రచయితగా బాగా పేరు రాకముందు ‘సాయిచంద్ర’ అనే పేరుతో పాటలు రాసిన ఇప్పటి ప్రముఖ రచయిత ఎవరో తెలుసా?
ఎ)  సిరివెన్నెల బి) చంద్రబోస్‌ సి) శివశక్తి దత్తా డి)  రామజోగయ్య శాస్త్రి

► ‘అరెరె వాన జడివాన...’ అనే పాట ‘ఆవారా’ అనే డబ్బింగ్‌ సినిమాలోనిది. ఈ వాన పాటలో హీరో కార్తీ పక్కన తడిసి ముద్దయిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) తమన్నా బి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సి) ప్రియమణి డి) ప్రణీత

► హీరోయిన్‌ సమంత ట్విట్టర్‌ ఐడీ ఏంటో తెలుసా?
ఎ) మీ సమంతా బి) సమంతా సి) సమంతాప్రభు 2  డి) యువర్స్‌ సమంత

► ‘గుండమ్మ కథ’ చిత్రంలో నటి జమున ఏ నటునితో జత కట్టారో తెలుసా?
ఎ) యస్వీఆర్‌ బి) ఏయన్నార్‌ సి) హరనాథ్‌ డి) యన్టీఆర్‌

► ఈ ఫొటోలో ఉన్నది నటుడు కైకాల సత్యనారాయణ మొదటి సినిమా స్టిల్‌. ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) రాజమకుటం  బి) సిపాయి కూతురు సి) స్వర్ణ గౌరి డి) శ్రీ కృష్ణార్జున యుద్ధం

► ఈ ఫొటోలో ఉన్న నటి ఎవరో చెప్పుకోండి?
ఎ) స్నేహ  బి)సంగీత సి) శ్రుతీహాసన్‌ డి) జెనీలియా

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) సి  2) ఎ  3) బి 4) బి  5) ఎ  6) ఎ  7) ఎ 8) సి  9) ఎ  10) బి  11) సి 12) డి  13) బి  14) ఎ 15) డి  16) ఎ  17) సి 18)  బి  19) బి 20) డి

మరిన్ని వార్తలు