హైదరాబాద్‌లో మహానటి ఇళ్లు.. ఎక్కడంటే !

13 May, 2018 17:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అలనాటి నటి సావిత్రికి భాగ్యనగరంతోను అనుబంధం ఉంది. సినిమా షూటింగ్ కోసం తరచూ భాగ్యనగరానికి విచ్చేసే ఆమెకు నగరంలోని చెరువులు, తోటలు, పచ్చదనం అమితంగా ఆకట్టుకునేవి. అందుకే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు నిర్మించుకున్నారు. 1960 ప్రాంతంలో యూసఫ్ గూడలో ఎకరం స్థలంలో తన అభిరుచికి అనుగుణంగా రెండు భవనాలు నిర్మించారు.

అందులో ఒక ఇంటి బాల్కనీలో కూర్చొని ఎదురుగా ఉన్న చెరువును చూస్తూ గడపటం ఆమె ఎక్కువగా ఇష్టపడే వారట. అప్పట్లో ఆ ఇంటిని సావిత్రి బంగ్లా అని పిలిచేవారు. ప్రస్తుతం ఆ చెరువు ప్రాంతంలో కృష్ణకాంత్ పార్కు ఏర్పాటైంది. తర్వాతి కాలంలో ఆ రెండు ఇళ్లు సావిత్రి అక్క భర్త మల్లికార్జునరావు సొంతమయ్యాయి. కాల క్రమేణా సావిత్రి బంగ్లా కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ భవనాల స్థానంలో పెద్ద అపార్ట్ మెంట్ ఒకటి వచ్చేసింది. ఇక ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మరేపుతోంది.

మరిన్ని వార్తలు