నెటిజన్లపై మండిపడ్డ హీరోయిన్‌ శ్రియ

13 Sep, 2017 18:59 IST|Sakshi
నెటిజన్లపై మండిపడ్డ హీరోయిన్‌ శ్రియ

చెన్నై: గ్లామర్‌ విషయంలో హీరోయిన్‌ శ్రియ కూడా చాలా చిత్రాలలో శృతి మించే నటించింది. అసలు అందానికి, అశ్లీలతకు తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండి పడింది. ఆమె ఏమన్నదంటే.. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడరన్‌ దుస్తులు ధరిస్తే అశ్లీలం,  అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది.

అది చూసే  వారి దృష్టిని బట్టే ఉంటుంది. అయితే ప్రస్తుతం నెటిజన్లు మోడరన్‌ దుస్తులు ధరించిన హీరోయిన్ల  గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ ప్రశ్నించింది. నిజం చెప్పాలంటే మేము మేముగానే ఉన్నాం. వ్యత్యాసం అనేది మీ కళ్లలోనే ఉంది. చీర కట్టినా, మోడ్రన్‌ దుస్తులు ధరించినా అందం అనేది ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది.

ఇంటర్నెట్‌లో హాట్‌​హీరోయిన్స్‌ అని టైప్‌ చేస్తే చాలు అర్ధ నగ్నం, నగ్నం హీరోయిన్ల చిత్రాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని మార్పింగ్‌ ముఖాలు ఉంటాయి. కొందరు హీరోయిన్లు తమ అందాలను ఆరబోసే విధంగా కురచ దుస్తులు ధరించి ఫోటోలను తమ ఇస్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందేస్తున్నారు. హిందీ చిత్రం జులీ-2లో హీరోయిన్‌ రాయ్‌లక్ష్మీ నటించిన దృశ్యాలు అర్ధనగ్నానికి ఎక్కువ, నగ్నానికి కొంచెం తక్కువ అన్నట్లుగా ఉన్నాయి. అలాంటి అశ్లీల దృశ్యాలకు గ్లామర్‌ అనే పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపించక మానదు.