తన ఫారిన్‌ ప్రియుడి గురించి చెప్పిన తాప్సీ

12 May, 2020 14:48 IST|Sakshi

‘ఝుమ్మందినాదం’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి అలరించిన నార్త్‌ హీరోయిన్‌ తాప్సీ. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ప్రభాస్‌తో కలిసి నటించిన ‘మిస్టర్‌ పరెఫెక్ట్‌’ కూడా తాప్సీకి అదృష్టాన్ని తీసుకరాలేకపోయింది. దీంతో బాలీవుడ్‌ బాట పట్టింది ఈ ఢిల్లీ భామ. అయితే అక్కడ అదృష్టం కొద్ది వరుస చిత్రాలతో చేస్తూ బిజీగా మారిపోయారు. అందరూ ఆలోచింపచేసే చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వరుస సినిమాలు, విజయాలతో ఉన్న తాప్సీ తాజాగా తన ప్రియుడిని అధికారికంగా మీడియా ముందుకు తీసుకొచ్చింది.  

డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథియాస్ బో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఇద్దరు పలు సందర్బాల్లో బయట కనిపించినా కూడా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. ఎట్టకేలకు వీరిద్దరి మద్య వ్యవహారంపై క్లారిటీ వచ్చింది. స్వయంగా తాప్సి ఇతడే నా ప్రియుడు అంటూ తాజాగా ఓ ఇంటర్వూ‍్యలో పేర్కొన్నారు. తన ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించాకే అందరికి చెబుతున్నట్లు తాప్సీ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్రేమని దాచడానికి కారణం నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసమేనన్నారు. అయినా తను ఎవరితో ప్రేమలో ఉన్నాను అనే విషయం కుటుంబానికి తెలుసని.. అది ప్రపంచానికి తనకు అవసరం వచ్చినప్పుడు చూపించొచ్చని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల అంగీకారం లేకపోతే.. ఏ ప్రేమ జీవితాంతం ఉండదని తాప్సీ అభిప్రాయపడ్డారు. 

ఇక ఈ విషయంపై తాప్సీ తల్లి నిర్మల్‌జీత్‌ కూడా మాట్లాడారు. ‘నాకు తాప్సీపై పూర్తి నమ్మకం ఉంది. ఆమె తన జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకున్నా.. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఆమెకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. తాప్సీ సినిమా కెరీర్‌ విషయానికి వస్తే ఇటీవల ‘థప్పడ్‌’ సినిమాతో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు హిందీ ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా ‘జన గణ మన’ అనే తమిళ ప్రాజెక్టుకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. తాప్సి తెలుగు సినిమాలతో కెరీర్‌ ఆరంభించినప్పటికీ.. బాలీవుడ్‌లోనే బ్రేక్‌ అందుకున్నారు.

చదవండి:
ప్రభాస్‌తో ప్యాన్‌ ఇండియా చిత్రం.. రాజు భారీ స్కెచ్‌?
15 ఏళ్లు : జనాల గుండెల్లో ‘భద్ర’

మరిన్ని వార్తలు