హారర్‌ కథ

15 Nov, 2019 05:25 IST|Sakshi
మున్నాకాశి

సంగీత దర్శకుడు మున్నాకాశి హీరోగా నటించి, దర్వకత్వం వహించిన చిత్రం ‘హేజా’. ఏ మ్యూజికల్‌ హారర్‌ అనేది ట్యాగ్‌లైన్‌. కేవీయస్‌ఎన్‌ మూర్తి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మున్నాకాశి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ద్వారా హీరోగా, దర్శకునిగా పరిచయం అవుతున్నాను. మంచి కథాంశంతో రూపొందించిన మ్యూజికల్‌ హారర్‌ మూవీ ఇది. ఈ సినిమాకి సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్‌గా ఉంటాయి’’ అన్నారు. కో–ప్రొడ్యూసర్‌ వి.యన్‌ వోలేటి మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన హారర్‌ చిత్రాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ఎంతో క్లారిటీతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది’’ అన్నారు. తనికెళ్ల భరణి, ముమైత్‌ఖాన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు