సీఎంకు బాలకృష్ణ బంధువు అయినందుకే..

31 Jan, 2017 18:38 IST|Sakshi
సీఎంకు బాలకృష్ణ బంధువు అయినందుకే..

హైదరాబాద్: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ బంధువు కాబట్టే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషనర్ వాదించారు. ఈ సినిమాకు పన్ను మినహాయింపునకు సంబంధించి జీవో 14ను రద్దు చేస్తామని, మరో రెండు రోజుల్లో కొత్త జీవో ఇస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.


(చదవండి: శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు)