డబ్బే ప్రధానం కాదు

8 Nov, 2019 06:26 IST|Sakshi
మన్నారా చోప్రా, అమ్మ రాజశేఖర్, రాధారాజశేఖర్‌

‘జీవితంలో డబ్బే ప్రధానం కాదు.. కుటుంబం, సుఖసంతోషాలే ముఖ్యం’ అని తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘హై 5’. మన్నారా చోప్రా లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. ‘రణం’ ఫేమ్‌ అమ్మరాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాధ క్యూబ్‌ బ్యానర్‌పై రాధారాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌లో భాగంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో మన్నారా చోప్రాపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ‘అమ్మ’ రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘మ్యూజికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్‌తో ‘రణం’ తర్వాత మళ్లీ అంతటి వైవిధ్యమైన కథాంశంతో నా భార్య నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో 12 పాటలుంటాయి. ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తున్నారు. మాటల్ని పాటల్లా మార్చి నేటి తరానికి తగ్గట్టు పూర్తి వినోదభరితంగా రూపొందిస్తున్నాం.

గోవాలోని చిన్న దీవిలో ఓ సెట్‌ వేసి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాలో చిన్న సందేశంతో పాటు వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘మంచి మసాలా పాటలతో ఈ సినిమా ఉంటుంది. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది’’ అన్నారు మన్నారా చోప్రా. ‘‘గురువారం షూటింగ్‌తో చిత్రీకరణ ముగిసింది. జనవరిలో ఈ సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు రాధారాజశేఖర్‌. ‘‘అమ్మ రాజశేఖర్‌ వద్ద సహాయకుడిగా పనిచేశా. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ సినిమాకు నృత్యాలు  సమకూర్చా’’ అన్నారు నత్య దర్శకుడు ప్రశాంత్‌. అమ్మ రాజశేఖర్, జాస్మిన్, జబర్దస్త్‌ బ్యాచ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ముజీర్‌ మాలిక్, సంగీతం: తమన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా