ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

31 Mar, 2020 20:30 IST|Sakshi

ఇటు బుల్లితెర‌, అటు వెండితెర‌, వీలు చిక్కితే మ్యూజిక్ ఆల్బ‌మ్స్ అంటూ అన్నింట్లో అడుగుపెట్టింది హీనా ఖాన్‌. అంతేకాక‌ హిందీ బిగ్‌బాస్ 11 సీజ‌న్‌లోనూ పార్టిసిపేట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. కాగా ఓవైపు దేశం లాక్‌డౌన్‌లో ఉంది. కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రూ చ‌చ్చిన‌ట్లు ఇంట్లో ఉండాల్సిందే. లేద‌ని కాలు బ‌య‌ట‌పెడితే పోలీసు లాఠీ దెబ్బ‌లు రుచి చూడాల్సిందే. ఒక‌రోజు, రెండు రోజులు.. ఇలా ఎన్నిరోజుల‌ని ఇంట్లో నుంచి క‌ద‌ల‌కుండా ఉండ‌గ‌లం. కొత్త సినిమా ఊసే లేదు, పోనీ సీరియ‌ల్స్ అయినా చూద్దామా అంటే.. షూటింగ్‌లు ఆగిపోవ‌డంతో అరిగిన టేప్ రికార్డ‌ర్‌లా పాత ఎపిసోడ్ల‌నే మ‌ళ్లీ వేస్తున్నారు. అయితే బోర్ క‌ట్ట‌కుండా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి నేనున్నానంటూ అభిమానుల‌కు అభ‌యమిస్తోంది న‌టి హీనా ఖాన్‌.

స్వీయ నిర్బంధం పాటిస్తూనే వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా వీడియోలు చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. మ‌రేం భ‌య‌ప‌డ‌కండి.. అది నిజ‌మైన ఏడుపు కాదు. ఇంట్లో హీనా వాళ్ల అమ్మ డోర్‌మ్యాట్ ఉత‌క‌మ‌ని ఆదేశించింది. చెయ్య‌న‌ని క‌రాఖండిగా చెప్ప‌లేక‌, అలా అని ఉత‌క‌లేక‌ మ‌ధ్య‌లో న‌లిగిపోయింది. కానీ చివ‌రికి మాత్రం  ఉత‌కడానికి రెడీ యింది. చేస్తున్న క‌ష్టాన్ని మర్చిపోయేందుకు పాటలు పెట్టుకుని దానికి త‌గ్గ‌ట్టుగా పెదాలు ఆడించ‌డ‌మే కాక హావ‌భావాలు ఒలికించింది. చివ‌ర్లో ఈ ప‌ని నా వ‌ల్ల కావ‌ట్లేదు బాబోయ్ అంటూ ఏడుపు లంకించుకుంది. గ‌తంలో మాస్క్ ఎలా క‌ట్టుకోవాలో సైతం చూపిస్తూ వీడియో షేర్ చేసింది.

#HinaKhan on cleaning duty at home during quarantine 📷 #StayHomeStaySafe #LOL

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా