ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్లో ఆరు గంటలు

17 Sep, 2014 09:45 IST|Sakshi
ఇడ్లీ, దోశ, పొంగల్.. జిమ్లో ఆరు గంటలు

హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగర్ దక్షిణాది వంటకాలపై మనసు పారేసుకున్నాడు. ఇడ్లీ, దోశ, పొంగల్ వరుసగా లాగించేసి...వాటిని అరిగించుకోవటానికి సుమారు ఆరుగంటలు జిమ్లో కసరత్తు చేశాడు. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన 'ఐ'  సినిమా ఆడియో ఫంక్షన్కు చెన్నై వచ్చిన  ష్వార్జ్ నెగర్...కాంటినెంటల్ వంటకాల్ని కాదని,  అడిగి మరీ ఇడ్లీ, దోశ, పొంగల్ను ఇష్టంగా ఆరగించాడు. ఆ తర్వాత చెమటలు కక్కేలా ఆరు గంటలు వర్క్ అవుట్ చేశాడట.

అంతేకాకుండా ష్వార్జ్ నెగర్  తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టుపై కూడా మనసు పడ్డాడట. ఈవిషయాన్ని 'ఐ' చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ వెల్లడించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసిందుకు ష్వార్జ్ నెగర్ పంచెకట్టులో వెళదామనుకున్నా... సమయం సరిపోనందున 'అమ్మ'ను సూట్లోనే కలిసినట్లు రవిచంద్రన్ తెలిపాడు. 'ష్వార్జ్ నెగర్ 3.30కి లాండ్ అయ్యాడు. 5.30కి బ్రేక్ ఫాస్ట్ చేశాడు...ఆ తర్వాత జిమ్లో ఆరు గంటలు గడిపాడు' . ఫిట్నెస్పై ష్వార్జ్ నెగర్కి ఉన్న అంకిత భావం చూసి చిత్ర యూనిట్ స్టన్ అయ్యారట. ఆరు పదులు వయసు దాటినా ష్వార్జ్ నెగర్ ఇప్పటికీ కుర్రాడిలా షూటింగ్లో ఫైట్స్ చేస్తూ కాళ్లు చేతులకు గాయాలు తగలించుకోవటం అలవాటే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా