ఫ‌స్ట్ బ్ల‌డ్ హీరో క‌న్నుమూత‌

17 Apr, 2020 10:31 IST|Sakshi

గోల్డెన్ గ్లోబ్ విజేత‌, అల‌నాటి ప్ర‌ముఖ హాలీవుడ్ హీరో బ్రేన్ డెన్నీ(81) బుధ‌వారం త‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. కాగా అత‌ను క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించ‌లేద‌ని, స‌హ‌జ మ‌ర‌ణ‌మేన‌ని కుటుంబీకులు స్ప‌ష్టం చేశారు. తండ్రి మ‌ర‌ణం త‌మ‌కు తీర‌ని లోట‌ని అత‌ని కూతురు ఎలిజ‌బెత్ విచారం వ్య‌క్తం చేసింది. బ్రేన్ డెన్నీ 1938లో క‌నెక్టిక‌ట్‌లోని బ్రిడ్గ్‌పోర్ట్‌లో జ‌న్మించాడు. ప‌న్నెండు సంవ‌త్స‌రాల‌కే యూఎస్ మెరైన్స్‌లో ప‌నికి కుదిరాడు. అలా ఒకినావా ద్వీపంలో కొంత‌కాలం ప‌నిచేసిన అనంత‌రం న్యూయార్క్‌కు ప‌య‌న‌మ‌య్యాడు. అక్క‌డ‌ మార్థా స్టీవ‌ర్ట్‌తో క‌లిసి స్టాక్‌బ్రోక‌ర్‌గా ప‌ని చేశాడు. అదే స‌మ‌యంలో సినిమాల‌వైపు అడుగులు వేశాడు. అక్క‌డ‌ జెన్నిఫ‌ర్‌ అనే యువ‌తిని వివాహం చేసుకోగా వీరికి కొడుకు కార్‌మాక్, కూతురు ఎలిజ‌బెత్ సంతానం.(భిక్ష‌గాడి సాయం తీసుకున్న స్పైడ‌ర్ మ్యాన్‌)

అత‌ను ఫ‌స్ట్ బ్ల‌డ్‌, రోమియో అండ్ జూలియ‌ట్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌తో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాడు. నాలుగు ద‌శాబ్ధాల కెరీర్‌లో టీవీ షోల‌లోనూ క‌నిపించి అభిమానుల‌కు వినోదాన్ని అందించాడు. 1985లో స్కిఫి- కాకూన్ సినిమాలో ఏలియ‌న్స్ లీడ‌ర్‌గా క‌నిపించాడు. 1996లో వ‌చ్చిన రోమియో జూలియ‌ట్ సినిమాలో రోమియో తండ్రిగా న‌టించాడు. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అవార్డుల క‌న్నా ముందుగా ప్ర‌క‌టించే ప్రముఖ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఆయ‌న త‌న ఖాతాలో వేసుకున్నాడు. (గురి మారింది)

మరిన్ని వార్తలు