నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!

25 Sep, 2019 02:05 IST|Sakshi

పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర రక్షణ ఉంటుంది. కానీ కొందరి విషయంలో తల్లిదండ్రులే విలన్లు అవుతారు. హాలీవుడ్‌ నటి డెమీ మూర్‌ జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటనకు ఆమె తల్లే కారణమయ్యారు. ఓ చాట్‌ షోలో ఆమె ఈ విషయం గురించి చెప్పారు. ‘‘నా టీనేజ్‌లో ఓ వ్యక్తి నాపై అత్యాచారం జరిపాడు. ఆ భయంకరమైన సంఘటనను నేనెప్పటికీ మరచిపోలేను. కూతురిపై అత్యాచారం జరగడానికి తల్లే కారణం అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అంటూ ఆ షోలో భావోద్వేగానికి గురయ్యారు డెమీ మూర్‌. ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి నా పై అత్యాచారం జరిపాడు. దానికి కారణం మా అమ్మే. మద్యం కోసం అతని దగ్గర మా అమ్మ 500 డాలర్లు తీసుకుని, నన్ను బలి చేసింది. అయితే ఎక్కడో ఒక మూల మా అమ్మ ఈ నిర్ణయం తీసుకుని ఉండదనే ఫీలింగ్‌ ఉంది. నేరుగా ఈ ఒప్పందం జరిగి ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ సంఘటనకు దారి ఇచ్చింది తనే కదా.

ఒక క్రూరమైన వ్యక్తికి నన్ను అప్పగించింది. ఆ వ్యక్తి మా అమ్మ చేసిన మోసం గురించి చెప్పినప్పుడు షాక్‌ అయ్యాను. అలా నా బాల్యం నాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది’’ అని బాధపడ్డారు డెమీ. ‘‘టీనేజ్‌లోనే నేను ఇంటి నుంచి బయటికు వచ్చేశాను. చేతిలో చిల్లిగవ్వ లేదు. హాలీవుడ్‌లో సినిమా కెరీర్‌ మొదలుపెట్టాలనుకున్నాను. కానీ అనుభవం లేదు. అయితే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఆ ధైర్యంతోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ట్రై చేద్దామని ఫిక్స్‌ అయ్యాను. ‘జనరల్‌ హాస్పిటల్‌’ అనే టీవీ సిరీస్‌ నా జీవితానికి మంచి మలుపు అయింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంతగా సినిమాల్లో బిజీ అయ్యాను. నా ధైర్యం, ప్రతిభ, కష్టపడే తత్వం నన్ను స్టార్‌ని చేశాయి’’ అని డెమీ తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా