నటుడు నిక్‌ కన్నుమూత

8 Jul, 2020 00:07 IST|Sakshi

హాలీవుడ్‌ నటుడు నిక్‌ కార్డెరో (41) కరోనా కారణంగా మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్‌ న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్‌ ఆఫ్‌ ఏజెస్‌’, ‘బుల్లెట్‌ ఓవర్‌ బ్రాడ్‌వే’, ‘వెయిట్రస్‌’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్‌ గై’, ‘గోయింగ్‌ ఇన్‌ స్టయిల్‌’, ‘ఇన్‌సైడ్‌ గేమ్‌’, ‘మాబ్‌టౌన్‌’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుండి 2020 వరకూ టీవీ, థియేటర్, సినిమాలలో ఎన్నో రకాల పాత్రలతో మెప్పించారు. బుల్లితెర కోసం చేసినవాటిలో ‘బ్లూబ్లడ్స్‌’లో కనబర్చిన నటనకు నిక్‌ మంచి మార్కులు తెచ్చుకున్నారు. నిక్‌ మరణం పట్ల ఆయన సతీమణి అమందా క్లూట్స్‌ తన బాధను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించే నిక్‌ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. అందరితో స్నేహంగా ఉండేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేవాడు. అద్భుతమైన నటుడే కాదు గొప్ప సంగీత దర్శకుడు కూడా. 95 రోజులు ఆçస్పత్రిలో పోరాటం సాగించి, నిక్‌ తనువు చాలించాడు. డియర్‌ నిక్‌.. ప్రతిరోజూ నేను, మన బిడ్డ ఎల్విస్‌ నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు అమందా క్లూట్స్‌.

మరిన్ని వార్తలు