మహేష్‌ కొత్త సినిమాలోనూ అదే ఫార్ములా

10 May, 2018 12:13 IST|Sakshi

స్పైడర్‌ సినిమాతో మరోసారి నిరాశపరిచిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా  షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ తన ప్రతీ సినిమాలోనూ ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఫైట్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తాడు. అదే తరహాలో భరత్‌ అనే నేను కోసం కూడా ఓ ఫైట్‌ ను డిజైన్‌ చేశాడట.

మిర్చి సినిమాలో వానలో ఫైట్‌, శ్రీమంతుడు సినిమా కోసం మామిడి తోటలో ఫైట్‌, జనతా గ్యారేజ్‌లో గవర్నమెంట్‌ ఆఫీస్‌లో ఫైట్‌ సీన్స్‌ ఆ సినిమాలకే హైలెట్‌ గా నిలిచాయి. అదే తరహాలో భరత్‌ అనే నేను సినిమా కోసం హోలీ వేడుకల్లో పోరాట సన్నివేశాలు ప్లాన్‌ చేశాడట. మహేష్‌ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను 2018 వేసవిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు