హారర్ నేపథ్యంగా లైట్స్‌అవుట్

6 Jul, 2016 01:32 IST|Sakshi
హారర్ నేపథ్యంగా లైట్స్‌అవుట్

ఈ ఏడాది భారతీయ సినీపరిశ్రమలో హాలీవుడ్ చిత్రాలదే హవా అని సినీ పండితులంటున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ది జంగిల్‌బుక్, కంజూరింగ్-2 చిత్రాలు ఇక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, కంజూరింగ్, కంజూరింగ్-2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్స్ బ్రదర్స్ తాజా చిత్రం లైట్స్ అవుట్. హారర్, థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని డేవిడ్.ఎఫ్.శాండ్‌బెర్గ్ తెరకెక్కించారు.

చిత్ర కథ విషయానికి వస్తే చిన్న తనంలోనే భయాందోళనలతో ఇల్లు విడిచి వెళ్లిపోయిన ఒక యువతి పెద్ద అయిన తరువాత తనకు ఎదురైన సమస్యలే తన తమ్ముడికి ఏర్పడతాయని తెలిసి ఎలాగైనా ఆ సమస్య నుంచి తన తమ్ముడిని కాపాడుకోవాలని ప్రయతిస్తుంది. అయితే ఈ సమస్యలకు కారణం తన తల్లి శరీరంలో ప్రవేశించిన ఒక ఆత్మనేనని తెలియడంతో తను ఏమి చేసింది? చివరకు వారు రక్షించబడ్డారా? లేదా? ఇలాంటి పలు భయబ్రాంతులకు గురిచేసే సన్నివేశాల సమాహారమే లైట్స్ అవుట్ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు.

ఇది పూర్తిగా చీకటిలో జరిగే భయోత్పాదక సన్నివేశాలతో కూడిన చిత్రం అని పేర్కొన్నారు. చిత్రాన్ని త్వరలో తమిళం, ఆంగ్గ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.