అటు హారర్... ఇటు వినోదం...

19 Jan, 2016 00:35 IST|Sakshi
అటు హారర్... ఇటు వినోదం...

హారర్, వినోదం నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కింది. శ్రీనిక్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీను దర్శకత్వంలో రాజు కోటి నిర్మిస్తున్నారు. ‘‘వరంగల్, కరీంనగర్, గోదావరిఖని ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌తో టాకీ పూర్తయింది. హారర్ నేపథ్యంతో పాటు మంచి కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకర్షించేలా ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. రవికుమార్, వెంకట్, వినోద్, విక్టోరియా, శశాంక్, శ్రుతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం: సదివే దేవేందర్, కెమెరా: అనిల్ కౌటిపల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : బోయిన రాజుశెట్టి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా