హౌ ఈజ్‌ ద జోష్‌.. ట్విటర్‌లో సంబరాలు!

26 Feb, 2019 15:05 IST|Sakshi

ఆత్మాహుతికి దాడికి పాల్పడి భారత జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకుంది. జైషే దళాలపై మెరుపు దాడి చేసి అమర జవాన్లకు ఘనమైన నివాళి అర్పించింది. ఈ క్రమంలో భారత వాయుసేనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాన్య పౌరులు మొదలు సెలబ్రిటీల దాకా సోషల్‌ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. భారత ప్రతీకార చర్యను ఉటంకిస్తూ ప్రముఖ టీవీ, బాలీవుడ్‌ నటి దివ్యాంక త్రిపాఠి... ‘ ఈరోజు నిజంగా శుభోదయం! అవునా కాదా? టెర్రరిస్టులనే వణికించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఇన్‌స్టాలో ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆమెతో పాటు పలువురు టీవీ నటులు.. ఉడీ ఘటన అనంతరం జరిగిన మెరుపు దాడుల ఆధారంగా తెరకెక్కిన ‘ఉడీ: ద సర్జికల్‌ స్ట్రైక్స్‌’ సినిమాలోని ‘హౌజ్‌ ద జోష్‌’ అనే డైలాగ్‌ను కోట్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

కాగా పుల్వామా ఉగ్రదాడికి దీటుగా బదులిస్తామన్న భారత్‌ మాట నిలబెట్టుకుంది. 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 విజయవంతంగా పూర్తి చేసి... దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదలను హతమార్చినట్లు సమాచారం.

It is a good morning today! Isn't it? Outfit @mad.glam Company @vblitzcommunications Styled by @stylingbyvictor

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా