ధడక్‌ : జాన్వీ రెమ్యునరేషన్‌ ఎంత?

21 Jul, 2018 15:08 IST|Sakshi
ధడక్‌ మూవీ ఫైల్‌ ఫోటో

అతిలోక సుందరి, అలనాటి అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌, సినీ కెరీర్‌లోకి ఎంట్రీ ఇస్తూ తీసిన మూవీ ధడక్‌ విడుదలైంది. జాతీయ అవార్డు అందుకున్న సైరత్‌ మూవీకి రిమేక్‌గా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోని స్క్రీన్లపైకి వచ్చేసింది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సౌందర్యరాశి కలలు నిజమయ్యాయి. తొలి మూవీలోనే జాహ్నవి అద్భుతంగా నటించి, తల్లికి నటనలోనూ వారసురాలినని నిరూపించుకుంది. ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచి, ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న జాన్వీ కపూర్ పొందిన పారితోషికం ఎంత? అనేది ప్రస్తుతం ఆసక్తిదాయకమైన అంశంగా నిలిచింది.  ఈ వివరాలను సైతం డైలీహంట్‌ రిపోర్టు చేసింది. ధడక్‌ సినిమాకు గాను, జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలిపింది. తన తొలి సినిమాకు ఈ మేరకు పారితోషికం పొందిందని తెలిసింది. 

అలాగే ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయిన ఇషాన్ ఖట్టర్‌కు కూడా అరవై లక్షల రూపాయల పారితోషికమే ఇచ్చారట. అయితే వీరిద్దరి కంటే అధికంగా జాన్వీ తండ్రిగా ఈ సినిమాలో నటించిన అశుతోష్‌ రాణాకు రూ.80 లక్షలకు చెల్లించారని.. సైరత్‌, ధడక్‌ రెండింటికీ మ్యూజిక్‌ డైరెక్టర్లుగా ఉన్న అజయ్‌-అతుల్‌లకు రూ.1.5 కోట్ల పారితోషికం ఇచ్చారని తెలిసింది. ధడక్ చిత్రానికి మ్యూజిక్ ఓ మ్యాజిక్ అని క్రిటిక్స్‌ సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాను నిలబెట్టిందని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసిందని అంటున్నారు. ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను అందించడంలో అజయ్, అతుల్ సంగీతద్వయం ఆకట్టుకున్నదని చెబుతున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా