కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?

31 Aug, 2016 12:59 IST|Sakshi
కపిల్ శర్మ సంపాదన ఎంతో తెలుసా?

ముంబై: ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’  కార్యక్రమంతో పాపులరయిన కపిల్ శర్మ సినిమా తారలకు దీటుగా సంపాదిస్తున్నాడు. నెలకు దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం అతడి ఖాతాలో పడుతున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. ఒక్కో ఎపిసోడ్కు రూ. 60 నుంచి 80 లక్షలు తీసుకుంటున్నట్టు తెలిపింది.

కామెడీ నైట్స్ షో సూపర్ హిట్ కావడంతో కపిల్ సెలబ్రిటీగా మారిపోయాడు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తూ సినీ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. అతడి షోలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలు అమితాసక్తి చూపిస్తున్నారు. స్క్రిప్టింగ్ నుంచి  ప్రొడక్షన్ వరకు అంతా తానే అయి ఈషోను కపిల్ నడిపిస్తున్నాడు. విభిన్నమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తున్నాడు. అంతేకాదు ఫిట్నెస్ పై కూడా ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నాడు.

కపిల్ టీమ్ లోని వారు కూడా భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్ కు సునీల్ గ్రోవర్ రూ.10 నుంచి 12 లక్షలు, కికు షర్దా రూ.5 నుంచి 7 లక్షలు, చందన్ ప్రభాకర్ రూ. 4 లక్షలు, సుమన చక్రవర్తి రూ. 6 నుంచి 7 లక్షలు, రొచెల్లె రావు రూ. 3 నుంచి 4 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్టు డీఎన్ఏ పత్రిక వెల్లడించింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఎపిసోడ్ కు రూ.8 నుంచి 10 లక్షలు ఇస్తున్నారని తెలిపింది.