మనుషుల్ని విడదీసే గోడ

13 Oct, 2017 00:03 IST|Sakshi

‘‘గోడ, బ్రిడ్జ్‌ ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ, గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్‌ మనుషుల్ని కలుపుతుంది. అదే ‘హౌరా బ్రిడ్జ్‌’ సినిమా కథ. హార్ట్‌ టచింగ్‌ ఎమోషనల్‌ డ్రామాగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేవన్‌ యాదు అన్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్‌  హీరోయిన్లుగా ఆయన  దర్శకత్వంలో శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వాదాలతో ఈ.ఎమ్‌.వి.ఈ. స్టూడియోస్‌ పతాకంపై  రూపొందిన ‘హౌరా బ్రిడ్జ్‌’ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా నాకొక లవ్లీ జర్నీ. డైరెక్టర్‌ చాలా క్లియర్‌గా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చారు. చాందిని వెరీ టాలెంటెడ్‌. డైరెక్టర్‌ తర్వాత కెమెరామెన్‌ విజయ్‌ మిశ్రా హీరో అనొచ్చు. అంతమంచి క్వాలిటీతో సన్నివేశాలు తీశారు. నిర్మాతలు సపోర్టివ్‌గా ప్రమోషన్స్‌ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘లాంగ్‌ అండ్‌ ఎమోషనల్‌ జర్నీ ఇది. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది’’ అన్నారు చాందినీ చౌదరి. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర, మనాలి రాథోడ్‌ పాల్గొన్నారు. రావు రమేశ్, అజయ్‌ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాజు.

మరిన్ని వార్తలు