‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

3 Sep, 2019 16:09 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ సోషల్‌ మీడియాలో తన స్నేహితులు, సహా నటుల పోస్ట్‌లకు హాస్యాస్పద కామెంట్‌లు పెట్టి సరదా పట్టిస్తుండాడు. అలా సామాజిక మాద్యమాల్లో ఫన్నీ కామెంట్‌ల స్పెషలిస్ట్‌గా పేరున్న అర్జున్‌ ఈ సారి బొల్తాపడ్డాడు. తన కామెంట్‌తో నెటిజన్లకు కోపం తెప్పించాడు. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ల అభిమానులు హీరో అర్జున్‌ కపూర్‌పై మండిపడుతున్నారు. తమ అభిమాన హీరోలను ‘సాధారణ హీరోలు’ అన్నందుకు అగ్గిమీద గుగ్గిలంలా అవుతున్నారు. టైగన్‌ ష్రాఫ్‌ తన వార్‌ కోస్టార్‌ హృతిక్‌ రోషన్‌, దర్శకుడు సిద్దార్థ్‌ల ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ పోస్ట్‌పై స్పందించిన అర్జున్‌ కపూర్‌పై ఈ స్టార్‌ హీరోల అభిమానులంతా ఫైర్‌ అయ్యారు.  హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు నటిస్తున్న చిత్రం వార్‌ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో షూటింగ్‌ సమయంలో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌లు నేలపై కుర్చుండగా.. దర్శకుడు సిద్దార్థ్‌, కుర్చీలో కూర్చున్న ఫోటోను పోస్ట్ చేశాడు. దానికి అర్జున్‌ కపూర్‌ దర్శకుడు సిద్దార్థ్‌ను ఉద్దేశిస్తూ..‘లెజెండ్‌తో సాధారణ నటులు’  అంటూ సరదాగా కామెంట్‌ పెట్టాడు. దీంతో హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ల అభిమానులంతా అర్జున్‌పై కామెంట్‌లతో దాడికి దిగారు. ఓ నెటిజెన్‌ ‘అర్జున్‌ కనీసం నవ్వు టైగర్‌ ష్రాఫ్‌తో కూడా పోల్చుకోలేవు’ మరో నెటిజెన్‌ ‘ అర్జున్‌ నీకు ఆస్థాయి లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.  

టైగర్‌ పెట్టిన పోస్ట్‌పై దర్శకుడు సిద్దార్థ్‌తో పాటు హీరో హృతిక్‌ రోషన్‌ కూడా స్పందించారు.‘ ఇంకా ఒక్కరోజు షూటింగ్‌ మిగిలి ఉంది..ఆ తర్వాత నీతో కలిసి పని చేసే అవకాశం ఉండదు టైగర్‌’అంటూ కామెంట్‌ చేశాడు. ఈ ఏడాది బెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న వార్‌ సినిమాను యష్‌ రాజ్‌ ప్రొడక్షన్‌లో ఆదిత్య చొప్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్‌, టైగర్‌ల  మధ్య యాక్షన్‌, భారీ ఛేజింగ్‌ సీన్స్‌ ఫీన్‌లాండ్‌ రోడ్లపై చిత్రీకరించినట్లు సినిమా యూనిట్‌ తెలిపింది.

I got your back sir @hrithikroshan and hopefully hes @itssiddharthanand got ours! 😋🤪 #onemonthtogo #2ndoct #war #hrithikvstiger

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా