ప్రియాంకా చోప్రాకు హృతిక్ రోషన్ ఛాలెంజ్!

22 Sep, 2014 11:04 IST|Sakshi
ప్రియాంకా చోప్రాకు హృతిక్ రోషన్ ఛాలెంజ్!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఉన్నట్టుండి ఓ కొత్త ఛాలెంజికి తెరతీశాడు. ఇన్నాళ్లూ ఐస్ బకెట్ ఛాలెంజ్, మన రైస్ బకెట్ ఛాలెంజ్, మమ్ముట్టి మొదలుపెట్టిన మై ట్రీ ఛాలెంజ్ లాంటివి మాత్రమే ఉండగా, హృతిక్ ఇప్పుడు 'ఆటో రిక్షా ఛాలెంజ్' మొదలుపెట్టాడు. త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా 'బ్యాంగ్ బ్యాంగ్' ప్రమోషన్ కోసమో ఏమో గానీ, అర్ధరాత్రి ఇంటికి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కాడు. అయితే, తన ఆటోలో ఎక్కిన వ్యక్తి బాలీవుడ్ హీరో అన్న విషయం మాత్రం సదరు డ్రైవర్కు ఏమాత్రం తెలియలేదట. ఈ విషయాన్ని హృతిక్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 'కారు వదిలేసి రాత్రిపూట ఆటోలో ఇంటికెళ్లా. నా సిటీ అంటే నాకిష్టం. డ్రైవర్ మాత్రం నన్ను గుర్తుపట్టకపోవడం సరదాగా ఉంది' అని అన్నాడు.

తాను ఆటోలో వెళ్లాను కాబట్టి, మీరు కూడా అలా వెళ్లి చూడండి అంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులను అతడు ఛాలెంజ్ చేశాడు. అతడలా సవాలు చేసినవారిలో షారుక్ ఖాన్, ఉదయ్ చోప్రా, డినో మోరియా తదితరులున్నారు. అయితే.. వాళ్లు మాత్రమే కాదు.. తన కొత్త స్నేహితురాలు ప్రియాంకా చోప్రాను కూడా హృతిక్ ఛాలెంజ్ చేశాడు.

''నేను సవాలు చేయగల ఏకైక అమ్మాయి.. ద సూపర్ ప్రియాంకా చోప్రా. నువ్వు సవాలు అంగీకరిస్తావా.. మూడురోజులే సమయం ఉంది'' అని ట్వీట్ చేశాడు. ఇటీవలే మేరీ కోమ్ చిత్రంలో నటించిన ప్రియాంక అయితే తన బాక్సింగ్ కిక్లతో ఆత్మరక్షణ చేసుకోగలదనుకున్నాడో ఏమో గానీ.. ఆమెను మాత్రమే సవాలు చేశాడు. ఇప్పటివరకు ఉదయ్ చోప్రా ఒక్కడు మాత్రం హృతిక్ సవాలును స్వీకరించాడు. మిగిలిన వాళ్ల సంగతి ఇంకా తెలియాల్సి ఉంది.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా