మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

19 Nov, 2019 12:24 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటనతోనే కాక తన డ్యాన్స్‌తో కూడా అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తాడు. శరీరాన్ని స్ప్రింగ్‌లా తిప్పుతూ రిథమిక్‌ డ్యాన్సర్‌ పేరుగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నాడు. తాజాగా హృతిక్‌ తల్లి పింకీ రోషన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియో అతడి అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. పదేళ్ల వయసులో హృతిక్‌ ఓ వివాహ వేడుకలో స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను హీరో తల్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడిమో  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైట్‌ ఫ్రాక్‌ వేసుకున్న ఓ పాపతో మొదలైన ఈ వీడియోలో.. హృతికి్ నీలిరంగు షర్టు, తెల్లటి ప్యాంటులో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు, నెటిజన్లంతా హృతిక్‌ చిన్ననాటి డ్యాన్స్‌ వీడియో చూసి ఫిదా అవుతున్నారు. 

#onecapturedmoments

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on

‘ఓ మై గాడ్‌.. హృతిక్‌ ఎంత బాగా డ్యాన్స్‌ చేస్తున్నాడు’, ‘బాబోయ్‌! హృతిక్‌ చిన్నప్పటి నుంచే మంచి డ్యాన్సర్‌ అన్నమాట’   ‘మీ ఈ చిన్ని ఎంజెల్‌.. అప్పడే స్టార్‌ అయ్యాడు’  అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ‘మధురమైన  వీడియోను షేర్‌ చేశారంటూ’  పింకీ రోషన్‌(హృతిక్‌ తల్లి)కు అభిమానులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ప్రముఖ డిజైనర్‌ సందీప్‌ కోశాల్‌ కూడా హర్ట్‌ ఎమోజీలతో పింకీ రోషన్‌ పోస్టుకు కామెంట్‌ చేశాడు. ఇక ఇటీవలే విడుదలై హృతిక్‌ రోషన్‌ ‘వార్‌’ మూవీ బీ-టౌన్‌ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురింపించింది. మొత్తం రూ. 317.77 కోట్లు రాబట్టి 2019లో భారీ వసూళ్ల చిత్రాలలో ‘వార్‌’ ముందు వరుసలో నిలిచింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా