అప్పడాలమ్మా అప్పడాలు

29 Jun, 2019 02:39 IST|Sakshi
హృతిక్‌రోషన్‌

.... అని రోడ్డుపై అమ్ముతున్నారు బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో హృతిక్‌రోషన్‌. హీరో అప్పడాలు అమ్మాడంటే అది కచ్చితంగా ఏదో సినిమాకే అయ్యుంటుంది. అవును... ‘సూపర్‌ 30’ కోసం హృతిక్‌ అప్పడాలు అమ్మారు. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రం ‘సూపర్‌ 30’. ఆనంద్‌ పాత్రలో హృతిక్‌ నటించారు. వికాస్‌ బాల్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాలోని హృతిక్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘ఆనంద్‌కుమార్‌ జీవితంలో ఇలా అప్పడాలు అమ్మే నాటి పరిస్థితులు ఎంతో ఉద్వేగంతో కూడుకున్నవి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన కష్టపడి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని హృతిక్‌ పేర్కొన్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూలై 12న విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు