సూపర్‌ 30 రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

10 Feb, 2019 15:48 IST|Sakshi

ఐఐటీ బాబాగా పేరుగాంచిన గణిత ఉపాధ్యాయుడు ఆనంద్‌ కుమార్‌ జీవిత చరిత్ర ఆధారంగా సూపర్‌ 30 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆనంద్‌ కుమార్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ నటించగా.. వికాస్‌ బాల్‌ దర్శకత్వం వహించారు. అయితే ఆ మధ్య వికాస్‌ బాల్‌పై మీటూ ఆరోపణలు రాగా.. ఆయన్ను ఈ చిత్రం నుంచి నిర్మాతలు తప్పించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా.. వాయిదాలు పడుతూ వస్తోంది. అయితే వికాస్‌ బాల్‌ను తప్పించే సమయానికే షూటింగ్‌ పూర్తైందని మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఈ మూవీని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్‌చేసినా.. అది కుదరలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. జూలై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. సాజిద్‌ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మృణాల్‌ ఠాకూర్‌, టీవీ నటుడు నందిష్‌ సింగ్‌ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని వార్తలు