చెన్నైలో హృతిక్‌ రోషన్‌ సందడి

4 Mar, 2020 08:33 IST|Sakshi
రాడో వాచ్‌లను ప్రారంభిస్తున్న బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌

కొరుక్కుపేట: చెన్నైలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ సందడి చేశారు. మంగళవారం సాయంత్రం చెన్నై రాయపేటలోని ఎక్స్‌ప్రెస్‌ అవెన్యూ మాల్‌లో ఉన్న రాడో స్టోర్‌లో కొత్త వాచ్‌లు రాడో ట్రూ స్క్వార్‌లను బాలీవుడ్‌ నటుడు, రాడో బ్రాండ్‌ అంబాసిడర్‌ హృతిక్‌ రోషన్‌ పాల్గొని ప్రారంభించారు. వందలాది మంది అభిమానులు అక్కడకు చేరుకుని హృతిక్‌ రోషన్‌ వెల్కమ్‌ అంటూ నినదిస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. నటుడు హృతిక్‌ రోషన్‌ సైతం అభిమానులకు అభివాదం చేస్తూ ఆధ్యంతం సందడి చేశారు. ఇందులో రాడో బ్రాండ్‌మేనేజర్‌ సిమ్రాన్‌చందోక్, జిమ్సన్‌ డైరెక్టర్‌ మథీన్‌ఖాన్, షఖీల్‌ఖాన్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు