క్లాస్‌కి వేళాయెరా

24 Jan, 2018 01:04 IST|Sakshi

బుక్స్‌ ముందు పెట్టుకుని మ్యాథ్స్‌ థియరమ్స్‌తో కుస్తీ పడుతున్నాడు బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌. అంతలోనే బెల్‌ మోగింది. ఇంకేముంది? చేతికున్న గడియారంవైపు ఓ లుక్కేసి క్లాస్‌కి బయలుదేరాడు. బీహార్‌ గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్‌కుమార్‌ బయోపిక్‌ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సూపర్‌ 30’. విశాల్‌బాల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను సోమవారం స్టార్ట్‌ చేశారు.

‘‘పవిత్రమైన వసంత పంచమి రోజున సరస్వతి పూజతో ‘సూపర్‌ 30’ సినిమా జర్నీని స్టార్ట్‌ చేశాం. మొదటిసారిగా టీచర్‌ పాత్ర చేస్తున్నాను. నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఆ దేవత ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని హృతిక్‌ రోషన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు