వేసవిలో క్రైమ్‌ కామెడీ

18 Mar, 2019 00:32 IST|Sakshi
రుద్రాక్ష , ధన్యా బాలకృష్ణ

రుద్రాక్ష , ధన్యా బాలకృష్ణ జంటగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హల్‌చల్‌’. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై గణేష్‌ కొల్లురి నిర్మించిన ఈ సినిమా సెన్సార్‌కి సిద్ధమవుతోంది. గణేష్‌ కొల్లురి మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులను మెప్పించేలా తీర్చిదిద్దారు శ్రీపతి.

మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. అనుకున్న ప్లానింగ్, బడ్జెట్‌లో సినిమాను పూర్తి చేశాడు దర్శకుడు. హనుమాన్, భరత్‌ చక్కటి సంగీతం అందించారు. రాజ్‌ తోట అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ఈ వేసవికి సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు  చేస్తున్నాం’’ అన్నారు. కృష్ణుడు, మధునందన్‌ ఇతర పాత్రల్లో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు