ఈ సినిమాతో నేను అప్‌డేట్‌ అయ్యాను

10 Dec, 2018 05:37 IST|Sakshi
దక్ష, తేజస్, వీవీ వినాయక్, హర్ష, బెక్కెం వేణుగోపాల్‌

బెక్కం వేణుగోపాల్‌

తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే, రాహుల్‌ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘హుషారు’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ వేడుకలో వీవీ వినాయక్‌ మాట్లాడుతూ – ‘‘బెక్కెం వేణుగోపాల్‌ అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా కొత్తవాళ్లకు. మంచి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు.

చిన్న సినిమా తీసి పెద్ద లెవల్లో రిలీజ్‌ చేయగలరు. ‘సినిమా చూపిస్త మావ’ అంత హిట్‌ కావాలి’’ అన్నారు.  ‘‘నా 9 సినిమాలను ఒక్కో అనుభవంలానే భావిస్తా. సినిమా పరంగా నేను అప్‌డేట్‌ అయ్యాను. టీమ్‌ నన్ను సినిమాలో ఇన్వాల్వ్‌ చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంజాయ్‌ చేశాను. కొత్తవాళ్లతో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్‌.‘‘క్వాలిటీ సినిమా తీసే నిర్మాతల్లో వేణుగోపాల్‌గారు ఒకరు’’ అన్నారు మధుర శ్రీధర్‌. 

‘‘వేణు గోపాల్‌ తపనున్న నిర్మాత. అందుకే ఈ సినిమా ఇంత అందంగా ఉంది’’ అన్నారు రాజ్‌తరుణ్‌. ‘‘వేణుగోపాల్‌గారు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. పాటలు బావున్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘‘5 ఏళ్ల క్రితం గోపీగారితో ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమా చేశాను. ఆ తర్వాత నుంచి ఆయన సలహాలు తీసుకుంటున్నాను’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘అవకాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్‌గారికి థ్యాంక్స్‌. సినిమాలో ఓ మ్యాజిక్‌ ఉంది అది చూసి ఎంజాయ్‌ చేయాల్సిందే’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు