డైరెక్షన్‌ మాత్రం చేయను

11 Dec, 2018 03:13 IST|Sakshi
రాహుల్‌ రామకృష్ణ

‘‘ఉద్యోగం అంటే ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం చేసే సాఫ్ట్‌వేర్‌ ఉగ్యోగి పాత్రలో నటించాను. నాకూ ఈ సినిమాలో హీరోలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ‘హుషారు’ సినిమాలో చూడాలి’’ అన్నారు నటుడు రాహుల్‌ రామకృష్ణ. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించారు. తేజస్, అభినవ్, దక్ష, ప్రియా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాహుల్‌ రామకృష్ణ పలు విశేషాలు పంచుకున్నారు.

‘‘అర్జున్‌ రెడ్డి’ చిత్రం తర్వాత పూర్తిస్థాయి పాత్ర చేస్తున్నది ఈ చిత్రంలోనే. సెకండ్‌ హాఫ్‌ మొత్తం నా క్యారెక్టర్‌ కనిపిస్తుంది. జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలు తప్ప ఇంకేం ఉండవు అనే మెసేజ్‌ని దర్శకుడు చెప్పదలిచారు. నా పాత్ర కోసం నా సాఫ్ట్‌వేర్‌ స్నేహితులను స్ఫూర్తిగా తీసుకొని నటించా. ప్రస్తుతం వెబ్‌ సీరిస్‌ల కోసం కథలు రాస్తున్నాను. దర్శకత్వం మాత్రం చేసే ఆలోచన లేదు. అలాగే సందీప్‌ కిషన్‌ ‘నిను వీడని నీడను నేను’లో విలన్‌గా నటిస్తున్నాను. రాజమౌళిగారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కీలక పాత్ర, రాజశేఖర్‌ ‘కల్కీ’ చిత్రంలో యాక్ట్‌ చేస్తున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా