తడిసిన బట్టల్లో వారిని చూసేందుకు హోలీ!

24 Mar, 2016 15:16 IST|Sakshi
తడిసిన బట్టల్లో వారిని చూసేందుకు హోలీ!

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగుల పండుగ హోలీని కూడా వదల్లేదు. హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుంచి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు మీరంతా హోలీని సంతోషంగా జరుపుకొంటారని, తనకు మాత్రం ఈ పండుగ నాడు భంగ్ తినడం, శృంగారం ఒలికించే అమ్మాయిలను చూడటం, పాఠశాలను ఎగ్గొట్టడం వంటివే సంతోషం కలిగించేవని ట్వీట్ చేశాడు.

హోలీ సందర్భంగా లభించే ఏకైక ఆనందం.. యువతులను తడిసిన దుస్తుల్లో ఒరకంట చూడటమేనని, దీనికి పెద్దల ఆమోదం కూడా ఉంటుందని, వారిని అలా చూస్తూ ఫీలైన చెంపదెబ్బ తినకుండా తప్పించుకోవచ్చునని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. హోలీ రోజు ఎవరు ఎవరిని చంపారు? ఎందుకు చంపారు అన్న కారణాలు ఏమీ తెలియకుండానే చాలామంది పండుగను జరుపుకొంటున్నారని, కొందరు భంగ్ వంటివి ఆస్వాదించడం కోసం  పండుగ జరుపుకుంటారని పేర్కొన్నాడు.