ఎందుకు సిగ్గు పడాలి: మోడల్ ఆగ్రహం

12 Feb, 2018 12:56 IST|Sakshi
హార్వీతో ప్రముఖ మోడల్, సింగర్ కేటీ ప్రైస్

లండన్: పదికోట్లు ఇస్తే తన శరీరాన్ని వారికి అప్పగిస్తానని గతంలో చెప్పడంతో ఆమెను అందరూ అసహ్యించుకున్నారు. కానీ అదే మహిళ నేడు తన కుమారుడి కోసం తల్లిగా చేస్తున్న పోరాటాన్ని నెటిజన్లు సహృదయంతో ప్రశంసిస్తున్నారు. మూడో భర్త కీరాన్ హేలర్‌తో కలిసి ఉంటున్న బ్రిటన్ ప్రముఖ మోడల్, సింగర్ కేటీ ప్రైస్ తన జీవితంలో ఏ విషయంలోనూ సిగ్గుపడాల్సిన అంశాలే లేవన్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆన్‌లైన్లో కుమారుడిపై వస్తున్న కామెంట్లను అరికట్టేందుకు వేసిన పిటిషన్ తాను చేసిన పనుల్లో అత్యుత్తమమైనదిగా కేటీ అభిప్రాయపడ్డారు. కుమారుడు హార్వీ (15)ని ఎప్పుడూ ఎందుకు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

హార్వీలో ఎన్నో లోపాలున్నాయని, కుమారుడి కారణంగా కేటీ ప్రైస్ ఎన్నో అవమానాలు భరిస్తున్నారని.. ఎంతో సహనంతో వాటిని ఎదుర్కొంటున్నారని మరికొందరు నెటిజన్లు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హార్వీ గురించి తల్లి టీవీ వ్యాఖ్యాత కేటీ ప్రైస్ స్థానిక మీడియాలో చర్చిస్తూ విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'నా కుమారుడు హార్వీ ప్రాడెర్ విల్లీ సిండ్రోమ్, సెప్టో ఆప్టిక్ డిస్‌ప్లేసియా, ఆటిజం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. అందరు తల్లుల్లాగే నేను కూడా హార్వీని టీవీ షోలకు తీసుకెళ్తున్నాను. తల్లిగా నేను చేయాల్సింది అతడికి మద్ధతుగా ఉండి ప్రేమను పంచడమే. పిల్లల లోపాలను మనం ఎత్తిచూపకూడదు. మనం ఎక్కడికి వెళ్తే వారిని కూడా తీసుకెళ్తే ఎంతో రిలాక్స్ అవుతారు. హార్వీని చూసి నేను సిగ్గుపడాల్సిన, ఆవేదన చెందాల్సిన అవసరమే లేదు. వాడి మంచితనం అందరికీ తెలియాలంటే బయటకు తీసుకెళ్లడమే ఉత్తమమని' మోడల్ కేటీ ప్రైస్ వివరించారు.

మరిన్ని వార్తలు