ప్రెస్‌మీట్‌ రద్దు...తిరిగి హైదరాబాద్‌కు వర్మ

28 Apr, 2019 14:26 IST|Sakshi

ఎక్కడా ఉండటానికి వీల్లేదంటున్నారు...

తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోమంటున్నారు...

సాక్షి, గన్నవరం : ఏపీ పోలీసుల చర్యను దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. విజయవాడలో ఉండకుండా వెళ్లిపోవాలంటూ పోలీసులు తమపై బలవంతంగా వెనక్కి పంపించారని ఆయన మండిపడ్డారు. గన్నవరం విమానాశ్రయం లాంజ్‌లోనే వర్మతో పాటు నిర్మాత రాకేష్‌ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని... తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.

దీనిపై వర‍్మ మాట్లాడుతూ ... ‘నేనేమైనా ఉగ్రవాదినా... నన్ను ఎందుకు నిర్బంధించారు. నిర్బంధించడానికి ఎలాంటి హక్కు, అధికారం ఉంది.’ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆయన ప్రశ్నలకు మాత్రం పోలీసులు సమాధానం ఇవ్వలేదు. తన నిర్బంధంపై రాంగోపాల్‌ వర్మ.... ‘నేను నిజం చెప్పేందుకు యత్నిస్తే ఏపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు అంటూ ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు.

ప్రెస్‌మీట్‌ రద్దు...తిరిగి హైదరాబాద్‌కు..
‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా ఏపీలో విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ రద్దు అయినట్లు వర్మ ప్రకటించారు. పోలీసులు తనను బలవంతంగా నిర్భందించారని, దాంతో తాను తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోతున్నట్లు తెలిపారు. ‘హే సీబీఎన్‌..వేరీజ్‌ డెమోక్రసీ’ అంటూ వర్మ ట్విటర్‌లో సూటిగా ప్రశ్నించారు. 

చదవండి....(రాంగోపాల్‌ వర్మను అడ్డుకున్న పోలీసులు)

మరిన్ని వార్తలు