నేను బతికే ఉన్నా : హీరోయిన్‌

12 Jul, 2018 10:02 IST|Sakshi

అహ్మదాబాద్‌ : సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి చిత్రాల్లో అల్లరి నరేశ్‌తో జతకట్టిన అందాల భామ మోనాల్‌ గజ్జర్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. మోనాల్‌ తన స్నేహితుడు డాక్టర్‌ రోహిత్‌ పుట్టిన రోజు వేడుక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ఉదయ్‌పుర్‌ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్‌ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా పాడైపోయింది.
 
దీంతో మోనాల్‌ మృతిచెందినట్టు వార్తలు రావడంతో ఆమె బుధవారం ఫేస్‌ బుక్‌ లైవ్‌కి వచ్చారు. తాను మరణించానని కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తనతో పాటూ అందరూ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని పేర్కొన్నారు. తన మెడ బెణకడంతో నొప్పి ఉందని, అందుకే బెల్ట్‌ ధరించినట్టు తెలిపారు. మోనాల్‌ చివరగా గుజరాతీ చిత్రం రేవాలో నటించారు. ప్రస్తుతం ఆమె గుజరాతీ చిత్రం ఫ్యామిలీ సర్కస్‌లో నటిస్తున్నారు. తెలుగుతో పాటూ గుజరాతీ, హింది, తమిళ్‌, మళయాల చిత్రాల్లో మోనాల్‌ నటించారు.

మరిన్ని వార్తలు