నా సంక్రాంతి వైజాగ్‌లోనే...

14 Jan, 2015 23:20 IST|Sakshi

 పండగ అంటే నాకు వైజాగ్ గుర్తొచ్చేస్తుంది. మా అమ్మమ్మ, తాతయ్య, ఇంకా చాలామంది బంధువులు వైజాగ్‌లోనే ఉన్నారు. వాళ్లందరితో పండగ చేసుకోవడం కోసం నేను వైజాగ్‌లో వాలిపోయా. నాకు ముగ్గులంటే చాలా ఇష్టం. పోటీపడి మరీ ముగ్గులు వేసేదాన్ని. ఇప్పుడూ అంతే. అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు. అవి లేకపోతే ఏం బాగుంటుంది. ఇక, టేస్టీ టేస్టీ కట్టె పొంగలి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇప్పటికీ, సంక్రాంతిని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను.
 -నందిత