అలాంటి విషయాలపై మాట్లాడను: హీరోయిన్

20 May, 2016 09:04 IST|Sakshi
అలాంటి విషయాలపై మాట్లాడను: హీరోయిన్

లాస్ ఏంజెలిస్: తనకు సెలబ్రిటీ స్టేటస్ వద్దని పాప్ సింగర్, హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపేజ్ వేడుకుంటోంది. ఫేమస్ స్టార్ పర్సనాలిటీగా ఉన్న జెన్నిఫర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడంతో అక్కడున్న అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాను వీఐపీగా, వీవీఐపీగా ఉండాలని.. మంచి గుర్తింపు రావాలని తాపత్రయ పడుతుండటం సహజమే. అయితే ఎందుకో పాప్ సింగర్ మాత్రం తన రూటు మార్చుకుంది. దర్శకులు, హీరోల ప్రవర్తన వల్ల మీరు ఫీమెల్ డామినేషన్ పై వ్యాఖ్యలు చేస్తుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాల గురించి కామెంట్ చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొంది.

ఎప్పటినుంచో తనకున్న సెలబ్రిటీ స్టేటస్ తో కెరీర్ నెట్టుకురావడం లేదని, అందుకే స్పెషల్ గుర్తింపును తాను ఫీల్ అవ్వనని స్పష్టంచేసింది. తాను సహజంగానే శ్రమించి పనిచేసే తత్వం గల వ్యక్తినని, వీటితో సక్సెస్ లు సాధించడం తనకు అలవాటుగా మారిందని పేర్కొంది. ఫీమేల్ డామినేషన్ గురించి తాను ఎప్పుడు బహిరంగంగానే అభిప్రాయాలు చెప్పేస్తానని, ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి లేదని ఓ ప్రశ్నకు బదులుగా జవాబిచ్చింది. షూటింగ్ స్పాట్ కు ఒకవేళ తాను 15 నిమిషాలు లేటుగా వచ్చినట్లయితే ఇంకేప్పుడూ తన జీవితంలో అలా జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పింది.