నా ఫేస్‌.. నా ఇష్టం

7 Jun, 2017 00:46 IST|Sakshi
నా ఫేస్‌.. నా ఇష్టం

‘‘నా బాడీ నా ఇష్టం. ఎవరెవరో చేసిన కామెంట్స్‌కు నేనెందుకు సమాధానం చెప్పాలి?’’ అంటున్నారు శ్రుతీహాసన్‌. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదంటూ కూసింత ఎరుపెక్కిన కళ్లతో చెప్పారామె. ఈ కోపానికి కారణం ఏంటంటే... శ్రుతీహాసన్‌ పెదాలకు సర్జరీ (లిప్‌ జాబ్‌) చేయించుకున్నారని సోషల్‌ మీడియాలో చాలామంది కామెంట్లు చేశారు.

ఆ కామెంట్లు నిజమేనా? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇది నా ఫేస్, నా బాడీ. వీటితో నేను ఏం చేస్తున్నాననేది ఎవరికీ సంబంధించినది కాదు. సోషల్‌ మీడియాలో జనాలు రాసే రాతల పట్ల నేను చింతించను. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందంగా కనిపించడం మా వృత్తి. మేమూ మనుషులమే. బరువు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్‌ చేసే ఫిగర్‌ మెయిన్‌టైన్‌ చేయడం కష్టం’’ అని పేర్కొన్నారు.