నాన్నగా నటించడం ఇష్టం లేదు

15 Aug, 2018 09:04 IST|Sakshi
నటుడు సత్యరాజ్‌

తమిళసినిమా:  నాన్న పాత్రల్లో నటించడం ఇష్టం లేదని నటుడు సత్యరాజ్‌ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఈ రోడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.  సత్యరాజ్‌ మాట్లాడుతూ  ఆరంభంలో తనకు ఘోరమైన విలన్‌ వేషాలే లభించాయన్నారు. నూరావదు నాళ్‌ చిత్రంలో విలన్‌ పాత్రను పోషించాననీ,  ఆ చిత్రం హిట్‌ అవుతుందా?  అన్న ఆతృతతో విడుదల సమయంలో థియేటర్లకు వెళ్లి చూశానన్నారు. ఎంజీఆర్‌ చిత్రాలకు వచ్చినంత జనం తన చిత్రానికి రావడంతో నటుడిగా పాస్‌ అయ్యాయన్నారు.

అప్పట్లో రజనీకాంత్, కమలహాసన్‌ ఇలా అందరి చిత్రాలకు నేనే విలన్‌ అని చెప్పారు.  హీరోగానూ పలు చిత్రాల్లో నటించిన తాను బాగానే సంపాదించుకున్నానని సత్యరాజ్‌ తెలిపారు. ఇకపై తండ్రి పాత్రలు వద్దనుకునేసరికి  తెలుగులో గోపీచంద్‌ హీరోగా  ఓ చిత్రంలో నాన్న పాత్రకు అంగీకరించానన్నారు. ఆ చిత్రంలో కథానా యకి త్రిష తనను మామగారు అని పిలుస్తుం టే చచ్చానురా! అనిపించిందన్నారు. అలా నటిస్తున్న సమయంలోనే బాహుబలి లాంటి గొప్ప అవకాశం వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

మరిన్ని వార్తలు