నాకు ఫిల్మీ బ్యాగ్రౌండ్ కూడా లేదు: తాప్సీ

6 Jul, 2013 00:59 IST|Sakshi
నాకు ఫిల్మీ బ్యాగ్రౌండ్ కూడా లేదు: తాప్సీ

 ‘‘హీరోయిన్ అయ్యి ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యింది. ఈ మూడేళ్ల కెరీర్‌ని ఓసారి విశ్లేషించుకుంటే సంతృప్తికరంగానే అనిపిస్తుంది’’ అంటున్నారు తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
 
 సినిమాల్లోకి రాకముందు తన ప్రపంచం చాలా చిన్నదని, ఇప్పుడు మాత్రం ఎక్కడికెళ్లినా పలకరించడానికి అభిమానులు ఉన్నారని తాప్సీ అంటున్నారు. దక్షిణాదిన సినిమా తారలను దేవుళ్లలా భావించేవాళ్లు ఉన్నారని తాప్సీ చెబుతూ -‘‘యాక్టింగ్‌లో నేను శిక్షణ తీసుకోలేదు. నాకు ఫిల్మీ బ్యాగ్రౌండ్ కూడా లేదు. మంచీ చెడూ తెలుసుకుంటూ ముందుకెళుతున్నాను.
 
 నేను చేసే ప్రతి పాత్రకు నేనే పెద్ద క్రిటిక్‌ని. ఒకవేళ ఏదైనా సినిమాలో లుక్ బాగాలేకపోతే తదుపరి చిత్రానికి మార్చేసుకుంటా. యాక్టింగ్ కూడా అంతే. సినిమా సినిమాకీ బెటర్‌మెంట్ చూపించడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అన్నారు. ‘ఎప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నారా?’ అనే ప్రశ్నకు సమాధానంగా -‘‘ఎప్పటివరకు కుదిరితే అప్పటివరకు యాక్ట్ చేస్తాను.
 
  మరో పదేళ్లు యాక్ట్ చేస్తానేమో. ఆ తర్వాత సినిమాల్లో చేయకూడదనుకుంటే మానేస్తా. సినిమాలకు దూరమైన తర్వాత మామూలు జీవితం గడపాలనుకుంటున్నాను. ప్రజలు నన్ను గుర్తుపట్టని చోట అయితే అలాంటి లైఫ్‌ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది.  అందుకే ఇక్కడుండను. విదేశాల్లో సెటిలైపోతా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి