నా డేటింగ్ గురించి మీకెందుకు?

2 Mar, 2014 23:22 IST|Sakshi
నా డేటింగ్ గురించి మీకెందుకు?

కథానాయికలు ఎలా ఉంటే బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చుతుందో నర్గిస్ ఫక్రి అచ్చంగా అలానే ఉంటారు. చేసింది మూడే మూడు సినిమాలే అయినా బోల్డంత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల పరంగా మాత్రమే కాదు... వ్యక్తిగతంగా ఉదయ్‌చోప్రాతో డేటింగ్ చేయడం ద్వారా కూడా ఆమె వార్తల్లో నిలిచారు. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని నర్గిస్‌ని అడిగితే - ‘‘పెళ్లా? నేనున్నది సినిమా పరిశ్రమలో. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే నాలాంటివాళ్లకి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే తీరిక కూడా ఉండదు. పెళ్లంటే రెండు మనసులతో ముడిపడిన విషయం కాబట్టి, చేసుకోబోయేవాడి మనసు అర్థం కాకుండా మూడు ముళ్లు వేయించుకోలేను. పైగా నాకు స్వతంత్ర భావాలెక్కువ. సొంతంగా డబ్బులు సంపాదించుకుంటూ, నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. దేశ, విదేశాలు తిరిగాను.

పెళ్లి చేసుకుని, హాయిగా కాపురం చేస్తున్న దంపతులెవరూ నాక్కనిపించలేదు. అందుకే, పెళ్లి గురించి ఆలోచించడంలేదు. భవిష్యత్తులో అయినా ఆలోచిస్తానో లేదో నాకు తెలియదు’’ అని చెప్పారు. మరి.. ఉదయ్‌తో డేటింగ్ చేస్తున్నారుగా? అనే ప్రశ్న నర్గిస్ ముందుంచితే - ‘‘నన్నీ ప్రశ్న చాలామంది అడిగారు. అప్పుడు వెంటనే వాళ్లను ‘మీ లో దుస్తుల రంగేంటి?’ అని అడగాలనిపిస్తుంది. ఆ ప్రశ్న విన్నవాళ్ల ఫీలింగ్ ఎలా ఉంటుందో? నా డేటింగ్ గురించి అడిగితే నాకూ అలానే ఉంటుంది’’ అని ఘాటుగా స్పందించారు నర్గిస్

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా