హీరోలను బట్టి కథల్ని రాయను:నితీష్ తివారీ

18 Jul, 2014 18:24 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను కథలు రాసేటప్పుడు నటుల్నిదృష్టిలో పెట్టుకోనని రచయిత నితీష్ తివారీ స్పష్టం చేశాడు. ఒక కథను అనుకున్న తరువాత తొలుత రాయడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపాడు.  కొన్ని సమయాల్లో మాత్రమే తాను సృష్టించే పాత్రకు ఎవరు తగిన న్యాయం చేస్తారని ఆలోచిస్తానని తెలిపాడు. గతంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ 'భూత్నాథ్ రిటర్న్స్' కు కథను సమకూర్చిన నితీష్.. తాజాగా అమీర్ ఖాన్ సినిమాకు కథను అందించనున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.

 

శుక్రవారం ముంబైలో జాతీయ వార్తా సంస్థతో మాట్లాడిన నితీష్.. తాను కథ బలాన్నే ప్రధానంగా నమ్ముకుంటానన్నాడు. కాకపోతే కొన్ని సమయాల్లో నటుల్ని కూడా దృష్టి పెట్టుకుని కథలు సిద్ధం చేస్తానన్నాడు. తాను ఆ రకంగా ఆహ్వానించే పాత్రలకు కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటానని నితీష్ పేర్కొన్నాడు.  ఈ మధ్యనే ఓ వాణిజ్య ప్రకటనకు నితీష్ దర్శకత్వం కూడా వహించారు.