లిప్‌లాక్ ఎంజాయ్ చేశా

13 Oct, 2016 02:45 IST|Sakshi
లిప్‌లాక్ ఎంజాయ్ చేశా

ఆరంభమే అట్టహాసం చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాన్ని తాను భాగా ఎంజాయ్ చేశానని సినీయర్ దర్శక నటుడు కే.భాగ్యరాజ్ పేర్కొన్నారు. విషయానికొస్తే లొల్లుసభ జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఆరంభమే అట్టహాసం. సంగీత భట్ కథానాయకిగా నటించిన ఇందులో కే.భాగ్యరాజ్ పాండియరాజన్,జ్ఞానసంబంధం,వైయాపిరి, శ్యామ్స్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని రంగా దర్శకత్వంలో స్వాతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి స్పందనను పొందాయని చిత్ర వర్గాలు తెలిపారు. చిత్ర పరిచయ కార్యక్రమం విజయదశమి సందర్భంగా నగరంలోని ఎంఐటీ కళాశాలో నిర్వహించారు.

వందలాది మంది విద్యార్థుల సమక్షంలో చిత్రంలోని ఆరంభమే అట్టహాసం అనే టైటిల్ సాంగ్‌ను కే.భాగ్యరాజ్ ఆవిష్కరించి తొలి సీడీని పాండిరాజన్‌కు అందించారు. ఈ సందర్భంగా కే.భాగ్యరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ముఖ్యంగా ఇందులోని లిప్‌లాక్ సన్నివేశాన్ని చాలా ఎంజాయ్ చేశాననీ తెలిపారు. ఈ చిత్రం కథానాయకుడు లొల్లుసభ జీవా, ఇతర చిత్ర యూనిట్‌కు మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంభమే అట్టహాసం చిత్ర యూనిట్ పాల్గొన్నారు.