యాంక‌ర్‌ని పొగిడిన ఆర్జీవీ.. నెట్టింట హల్‌చ‌ల్

26 Jun, 2020 14:35 IST|Sakshi

సోష‌ల్ మీడియాలో క్రియేటివ్ మేక‌ర్స్ సృష్టించే క్రేజీ సీన్స్ అన్నీ ఇన్నీ కావు. ర‌కర‌కాల ఎడిటింగ్ స్కిల్స్‌తో వావ్ అనిపిస్తారు. వారికి ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ సైతం ఫిదా అయ్యారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మీకు ఇటీవల ఎవ‌ర్ని చూస్తే వావ్ అనే ఫిలింగ్ కలిగింది అని ఆర్జీవీని ప్ర‌శ్నించ‌గా.. చాలామంది మీతో స‌హా అంటూ యాంక‌ర్‌ని పొడ‌గ్త‌ల‌తో ముంచెత్తాడు. దీనికి యాంక‌ర‌మ్మ సైతం సిగ్గుప‌డుతూ సోయ‌గాలు పోయింది. అయితే దీనికి ఖుషీ సినిమాలో బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని జ‌త‌చేసి వీడియో రూపొందించగా ఇది ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో సృజ‌నాత్మ‌క‌త‌కు హ‌ద్దులు ఉండ‌వు అంటూ రాంగోపాల్ వ‌ర్మ ట్విట్ చేశారు. 
(తండ్రీ కొడుకుల మృతి కేసులో గ‌ళ‌మెత్తిన సినీ లోకం)

ఇక సంచ‌నాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఆర్జీవీ మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన ప‌రువు హ‌త్యా ఆధారంగా మ‌ర్డ‌ర్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 21న ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎప్ప‌టిలాగే ఈ సినిమాపై కూడా తీవ్ర దుమారం చెల‌రేగుతోంది. (ఏడుపు కూడా రావడం లేదు: అమృతా ప్రణయ్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా