ఇండస్ట్రీ ధోరణి మారాలి

9 May, 2019 00:36 IST|Sakshi

‘‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో స్త్రీలను కేవలం గ్లామర్‌ వస్తువుల్లా మాత్రమే చూస్తారు. కానీ దానికి మించి ఇంకా చాలా ఉంటుంది స్త్రీలలో’’ అన్నారు సమీరా రెడ్డి. ఇండస్ట్రీలో స్త్రీలను ట్రీట్‌ చేసే విధానం, స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం గురించి ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మారాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది స్త్రీల నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేయడమే. చాలా సందర్భాల్లో నన్ను అభ్యంతరకరంగా అప్రోచ్‌ అయ్యారు కూడా. స్త్రీలను కేవలం గ్లామర్‌ కోసమే అనేట్టుగా చూడటం మానేయాలి.

ఇండస్ట్రీలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఒకేలాంటి గౌరవం ఉండదు. ఒకవేళ ఇండస్ట్రీలో ఏదైనా మార్చాలనుకుంటే అది ఇదే అని కోరుకుంటాను. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆ విధంగానే అడుగులేస్తోంది అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న అడుగులు. బేబీ స్టెప్స్‌లాగా’’ అని పేర్కొన్నారు. ‘అసభ్యకరంగా అప్రోచ్‌ అయ్యారు’ అని పేర్కొనడం వెనక కారణం క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించిందా? లేద సెక్సువల్‌ హెరాస్‌మెంటా? అన్నది క్లారిటీగా చెప్పలేదు సమీర.

మరిన్ని వార్తలు